
Trending News : బంగారం ధరలు బుధవారం మళ్లీ భారీగా పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.800 పెరిగి రూ.98,050కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.880 పెరిగి రూ.1,06,970 పలుకుతోంది. వెండి ధర ఆల్ టైం రికార్డుకు చేరింది. కేజీ వెండిపై రూ.900 పెరగడంతో రూ.1,37,000 వద్ద ధర పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇవే ధరలు ఉండనున్నాయి.