
Trending News : తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలకు ఈ నెల 24వ తేదీ నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని విద్యాశాఖ అధికారికంగా ప్రకటించింది. ఇటీవల వేసవి సెలవులపై రకరకాల ఊహాగానాలు, ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రకటన విడుదల చేయడం జరిగింది.
విద్యాశాఖ తెలిపిన ప్రకారం, పాఠశాలలు జూన్ 12న తిరిగి ప్రారంభం కానున్నాయి. ఇది అకడమిక్ క్యాలెండర్‌ను అనుసరించి ఖరారు చేసిన షెడ్యూల్ అని అధికారులు స్పష్టం చేశారు.
ఈ ప్రకటనతో విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్లకు స్పష్టత వచ్చింది.