
Sangareddy News : మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పంచాయతీరాజ్ అధికారులు,గృహ నిర్మాణ శాఖ అధికారులు, మునిసిపల్ అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని, జిల్లా లో వేసవిలో త్రాగునీటి ఇబ్బంది ఎత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు మాట్లాడుతూ అర్హతల పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని ఈ నెల 18 నుంచి 21 వరకు లబ్ధిదారులను గుర్తించాలన్నారు.
స్థానిక ఇందిరమ్మ కమిటీ సభ్యులు, గ్రామా, మండల ప్రత్యేక అధికారుల సమన్వయంతో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను గుర్తించాలన్నారు.
ఇప్పటికే జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా చేసిన గ్రామాలు కాకుండా జిల్లా వ్యాప్తంగా లబ్ధిదారుల గుర్తింపు కావాలని తెలిపారు.
ఈనెల 17 నుంచి లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్న లిస్టును అధికారులకు అందిస్తామన్నారు.
దరఖాస్తు చేసుకున్న దానిలో అర్హత గల వారిని గుర్తించాలన్నారు.
లబ్ధిదారులకు లిస్టును మే 2 తారీఖున డిస్ప్లే చేస్తామన్నారు.
నియోజవర్గానికి 3500 ఇండ్లు తోపాటు 20 శాతం అదనంగా జనాభా ప్రాతిపదికన ప్రభుత్వం కేటాయించిందన్నారు.
వేసవిలో తాగునీటి అధికారులు పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా పరిషత్ సీఈవో జానకి రెడ్డి , జిల్లా పంచాయతీ అధికారి సాయిబాబా, పిడి హౌసింగ్ చలపతిరావు, అడిషనల్ డి ఆర్ డి ఓ బాలరాజు, ఎంపీడీవోలు ఎంపీడీవోలు మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత అధికారులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.