Sadashivpet News : నా కుటుంబాన్ని రక్షించండి… పోలీస్ స్టేషన్ ముందు ఆవేదన వ్యక్తం చేస్తున్న ఓ మహిళ….రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఎదుటే మమ్మల్ని కిరాతకంగా వేధించారు.మా గోడు ఎవరితో చెప్పుకోవాలి. మమ్మల్ని పట్టించుకుని నాయకులు లేరు. మేము మా గోడు ఎవరికీ చెప్పుకోవాలి అని పోలీస్ స్టేషన్ ముందు బుధవారం ఓ మహిళ వేదన వ్యక్తం చేసింది. కొందరు వ్యక్తులు మారణాయుధాలతో మా ఇంటికి వచ్చి నానా బీభత్సం సృష్టించారని ఆమె తెలిపారు. నాతోపాటు నా భర్తను, కొడుకును కొట్టారని కత్తులతో చంపుతామని బెదిరించారని ఆమె కన్నీటితో చెప్పుకొచ్చారు.ఈ విషయమై ఐదు రోజుల క్రితం పోలీస్ స్టేషన్లో వారిపై ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు పోలీసులు వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నట్లు కనిపించడం లేదని అన్నారు. ప్రైవేట్ గా ఉద్యోగం చేసుకునే మేము బయటికి వెళ్లాలంటేనే వారు ఏమి చేస్తారు అని భయపడుతూ బతుకుతున్నామని నాకు భయభ్రాంతులకు గురి చేసిన వారిని తక్షణమే శిక్షించాలని ఆవేదన వ్యక్తం చేసింది. వివరాల్లోకి వెళ్తే… బాధితురాలు వివరాలు తెలిపిన ప్రకారం…సిద్ధాపూర్ గ్రామానికి చెందిన విజయలక్ష్మి వెంకటేశం గౌడ్ కుమారుడు శివమణి గౌడ్ ,స్థానిక రౌడీ షీటర్లనా సున్నం కిరణ్,సున్నం నరేష్ మేనకోడలు ను ప్రేమించాడని నెపంతో ఈ నెల 11 తారీకు అర్ధరాత్రి కత్తులతో…తన ఇంటి పై,కుటుంబ సభ్యులపై
కిరాతకంగా దాడి చేశారని పోలీస్ స్టేషన్ నందు విజయలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు.తనకు ఇక్కడ న్యాయం జరగకపోతే పై అధికారుల వద్ద నా బాధను విన్నవిస్తానని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రౌడీ షీటర్ ఆగడాలు జర్నలిస్ట్ పై కిరాతకంగా దాడి
సదాశివపేటకు చెందిన ప్రింట్ మీడియా అధ్యక్షులు సాక్షి విలేఖరి వెంకటేశం గౌడ్ పై ఈ నెల 11 తారీకు రౌడీ షీటర్లు దాడి చేశారు. సున్నం నరేష్,కిరణ్ అతని అనుచరులు రెచ్చిపోయారు. అర్ధరాత్రి వెంకటేశం గౌడ్ ఇంటిపై, అతనిపై కత్తులతో దాడి చేశారు. అడ్డుకోబోయిన వారిపై కూడా దాడి చేయించింది నరేష్ గ్యాంగ్. ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా మర్డర్ చేస్తామని బెదిరించారు. వెంకటేశం గౌడ్ కుమారుడు శివమణి గౌడ్ సున్నం నరేష్,కిరణ్ మేనకోడల్ని ప్రేమించాడని వెంకటేశం గౌడ్ పై ఇంటిపై దాడికి దిగాడు. తమ జర్నలిస్టుపై దాడికి దిగిన సున్నం నరేష్ అతని అనుచరులపై చర్యలు తీసుకోవాలని పేట ప్రింట్ మీడియా ,ఎలక్ట్రాన్ మీడియా జర్నలిస్టు సంఘాలు స్థానిక సిఐ వెంకటేశం కి బుధవారం ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకుంటారని సీఐ జర్నలిస్టులకు హామీ ఇచ్చారు.
