Sadashivpet News : జూబ్లీహిల్స్ స్టార్ట్ హాస్పిటల్ లో రక్త దానం చేసి మానవత్వం చాటుకున్న ఆత్మకూర్ గ్రామ యువకులు తమ్మలి రవి సయ్యద్ పాషా . ఆత్మకూర్ గ్రామంలో ఎవరికీ రక్తం అవసరం ఉన్న మేము ఉన్నాం అంటూ ముందుకు వచ్చి రక్త దానం చేస్తున్న ఆత్మకూర్ గ్రామ యువకులు.
జూబ్లీహిల్స్ స్టార్ట్ హాస్పిటల్ 11 నెలల చిన్న బాబు గుండె సమస్య తో హాస్పిటల్ చికిత్స పొందుతున్నారు… వైద్యులు పరీక్షించి హార్ట్ ఆపరేషన్ కోసం రక్తం కావాలి అన్నారు… దీంతో కుటుంబ సభ్యులు సోషల్ మీడియా ద్వారా వాట్సప్ లో బి నెగిటివ్ రక్తం అవసరం ఉందని తెలియ చేయడం జరిగింది…. వెంటనే ఆత్మకూర్ గ్రామానికి చెందిన సయ్యద్ పాషా స్పందించి నాది బి నెగిటివ్ రక్తం నేను రక్త దానం చేస్తా అని కుటుంబ సభ్యులకు సంప్రదించారు…. అతి తక్కువ మందిలో ఉండే బి నెగిటివ్ గ్రూప్ రక్తo స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్త దానం చేస్తా అనడం చాలా అభినందనీయం..రక్త దాతలు రక్త దానం చేస్తాను అని వెంటనే స్టార్ట్ హాస్పిటల్ కి వెళ్లి రక్త దానం చేసి ప్రాణ దాత గా నిలిచారు… రక్త దాతలు మాట్లాడుతూ రక్త దానం ప్రాణ దానం తో సమానం అన్నారు… చాలా మంది రక్త దానం చేస్తే ఎక్కడ బలహీన పడుతము అని అనుకుంటారు.. కానీ…ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ.. మూడు నెలలకు ఒక్కసారి రక్త దానం చేస్తే మరింత ఆరోగ్యంగా ఉంటారు……రక్త దానం చేసి ప్రాణ దాత గా నిలిచిన వారికి ఆత్మకూర్ బ్లడ్ డోనర్స్ క్లబ్ తరుపున అభినందించడం జరిగింది..
రక్త దానం చేయండి ప్రాణ దాతలుగా నిలువండి….🩸🩸
