Sadashivpet News : ఉజ్వల కళాశాల ఆధ్వర్యంలో మంగళవారం ప్రత్యేక దేశభక్తి ర్యాలీ నిర్వహించారు. కళాశాల విద్యార్థులు 60 అడుగుల జాతీయ పతాకంతో పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగారు. “భారత్ మాతాకీ జై” నినాదాలతో గగనాన్ని మార్మోగించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై నాగేష్ మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్సై నాగేష్ మాట్లాడుతూ, “విద్యార్థి దశలోనే దేశభక్తి భావం పెంపొందించుకోవాలి. జీవితంలో స్థిరపడి, సమాజానికి మరియు దేశానికి సేవ చేయాలి” అని సూచించారు.
ప్రిన్సిపాల్ కూచి శ్రీనివాస్ మాట్లాడుతూ, “విద్యార్థులు అన్ని రంగాల్లో తమ ప్రతిభను ప్రదర్శించి, ప్రపంచ దేశాల్లో భారతదేశ గౌరవాన్ని ఎల్లప్పుడూ మొదటి స్థానంలో నిలపాలి. దేశభక్తి పెంపొందించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ అమరేందర్ రెడ్డి, డైరెక్టర్లు రఘువరన్ రెడ్డి, కరస్పాండెంట్ పోల వెంకటేశం, లెక్చరర్లు సునీత, సమీర్, నర్సింలు, నవాజ్, నరేష్, వరలక్ష్మి, జీవిత, ప్రియాంక, సంగమేశ్వర్ రెడ్డి, ప్రవీణ్, గంగయ్య, రాజు, మమతా, లావణ్య, స్వాతి తదితరులు మరియు అనేక మంది విద్యార్థులు పాల్గొన్నారు.
