16/02/2026
Today sangareddy news

Sadashivpet News : కురుమలు ఐక్యంగా ఉండాలని మండల కురుమ సంఘం ప్రతిన బునారు.సదాశివపేట మండల పరిధిలోని ఓ ప్రైవేటు ఫామ్ హౌస్ లో శనివారం భారీగా హాజరైన కురుమ సంఘం పెద్దల సమక్షంలో సదాశివపేట మండల కురుమ సంఘం , యువజన సంఘం కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా సత్యనారాయణ,అధ్యక్షుడిగా శివ లింగు నర్సింలు , ఉపాధ్యక్షులుగా శ్రీశైలం, మాణిక్యం,ప్రధాన కార్యదర్శిగా రవి, కోశాధికారిగా ఒగ్గు బిక్షపతి ,కార్యదర్శులుగా అశోక్,మల్లేశం,కార్యవర్గ సభ్యులుగా రాంచందర్, సంగన్న, విట్టల్, పడకంటి రాజు సలహాదారుగా అంజన్న ఎన్నికయ్యారు. అనంతరం మండల యువజన సంఘం కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. యువజన సంఘం అధ్యక్షులుగా కొత్తగడి సురేష్, ఉపాధ్యక్షులుగా కో ల్కూర్ రాజ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా అక్షయ్, కార్యదర్శిగా సంగమేశ్వర్, కోశాధికారిగా అశోక్,కార్యవర్గ సభ్యులుగా బాబయ్య, బండ శ్రీశైలం,ప్రశాంత్, జడల ఆంజనేయులు, చీమలధర్ రవి ఎన్నికయ్యారు.ఈ కార్యక్రమంలో కురుమ సంఘం నాయకులు ఆంజనేయులు,సత్యనారాయణ, నాగేష్ ,మాణిక్యం,ఒగ్గు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *