Sangareddy News : యూరియా బస్తా కోసం రైతులు ఎంత కష్టపడ్డారో చూడాలి. శివ్వంపేట సహకార సంఘం వద్ద మంగళవారం రాత్రి నుంచే రైతులు క్యూలైన్లో నిలబడ్డారు. ఒక్క బస్తా కోసం వృద్ధులు, మహిళా రైతులు కూడా రాత్రంతా నిరీక్షించారు.
మండలంలోని పలు గ్రామాల నుంచి రైతులు కాలినడకన, సైకిళ్లపై, బైకులు, ఆటోలు, ట్రాక్టర్లు, కార్లలో కుటుంబ సమేతంగా వచ్చారు. కానీ బస్తా మాత్రం వెంటనే దొరకలేదు. దాదాపు 15 గంటల పాటు లైన్లో నిలబడాల్సి వచ్చింది.
చివరికి బుధవారం రెండు లారీలు యూరియా వచ్చాయి. అందరికి ఒక్కో బస్తా చొప్పున ఇస్తున్నామని సహకార సంఘం సీఈవో మధు తెలిపారు.
