Patancheru News : పాశమైలారంలో సువెన్ ఫార్మా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటియు రాష్ట్ర కమిటీ సభ్యుడు కే. రాజయ్య గారు నిరాహార దీక్షలు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్మికుల న్యాయబద్ధమైన హక్కులను కాపాడాలని, వారి సమస్యలపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. కార్మికుల సంక్షేమం కోసం పోరాటం కొనసాగుతుందని రాజయ్య గారు స్పష్టం చేశారు.
