18/02/2026
Telangana private colleges announce indefinite bandh from September 15 over pending fee reimbursement and scholarships

Latest News : సెప్టెంబర్ 15వ తేదీ నుంచి తెలంగాణలోని ప్రైవేట్ కాలేజీలు బంద్ కానున్నాయి. కారణం – ప్రభుత్వం ఇంకా విడుదల చేయని ఫీజు రీయింబర్స్‌మెంట్ మరియు స్కాలర్‌షిప్ బకాయిలు.

ప్రైవేట్ కాలేజీల యాజమాన్యం తెలిపిన వివరాల ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు సుమారు రూ.10 వేల కోట్ల రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ బకాయిలను తక్షణం క్లియర్ చేయకపోతే, ఈ నెల 15వ తేదీ నుంచి నిరవధికంగా కాలేజీలను మూసివేయాల్సి వస్తుందని హెచ్చరించింది.

ఈ నేపథ్యంలో తాజాగా రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ను కలిసి ప్రైవేట్ కాలేజీ ప్రతినిధులు నోటీసు అందజేశారు. పెండింగ్ బకాయిలు విడుదల చేయకపోవడంపై నిరసనగా, ఈ ఏడాది ఇంజనీర్స్ డేను “బ్లాక్ డే”గా జరుపుతామని కూడా ప్రకటించారు.

👉 విద్యార్థి సంఘాలు ఇప్పటికే ఈ సమస్యపై ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయగా, ఇప్పుడు ప్రైవేట్ కాలేజీల యాజమాన్యం కూడా అదే డిమాండ్‌ను గట్టిగా వినిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *