Sadashivpet News : బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య జన్మదినం సందర్భంగా హైదరాబాద్ లోని విద్యానగర్ బీసీ భవనం లో బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు తుల్జారం గౌడ్ తో సదాశివపేటకు చెందిన బీసీ విద్యార్థి సంఘం జాతీయ జాయింట్ కన్వీనర్ ఈశ్వర్ లు మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపినట్టు శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..బీసీల అభ్యున్నతి కోసం బీసీ, ఎస్సీ ,ఎస్టీ విద్యార్థుల కోసం గత 50 సంవత్సరాల నుండి ఎన్నో ఉద్యమాలు పోరాటాలు చేస్తున్న బీసీ నేత ఆర్ కృష్ణయ్య ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకొని..ఉన్నత స్థాయి పదవులతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. వారి బాటలో నడుస్తున్న వారి కుమారులు బిసి ఉద్యమ నేత డాక్టర్ ర్యాగ అరుణ్ కు సన్మానం చేసినట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు శ్రవణ్ ,బోయిన్ ,విట్టల్ ,తదితరులు పాల్గొన్నారు.
