
Jobs Update : తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు ఇది గుడ్ న్యూస్. సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది బంపర్ ఆఫర్ అనే చెప్పవచ్చు. తెలంగాణ ప్రభుత్వం 390 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈ) ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అర్హత ఉన్నఅభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. మంచి వేతనం కూడా ఉండనుంది. నోటిఫికేషన్ పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం.
తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల స్కీం కోసం రేవంత్ సర్కార్ 390 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ప్రభుత్వం విడుదల చేసింది. మ్యాన్ కైండ్ ఎంటర్ ప్రైజెస్ ఏజెన్సీ ద్వారా ఔట్ సోర్సింగ్ విధానంలో ఏడాది కాలానికి హౌసింగ్ కార్పొరేషన్ ఈ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత ఉండి ఆసక్తి గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుకు కూడా సరిపడా సిబ్బంది లేనట్టు సమాచారం. దీంతో ఇందిరమ్మ ఇళ్ల తనిఖీ బాధ్యతను ప్రభుత్వం ప్రైవేట్ ఇంజనీర్లకు అప్పగించనున్నట్లు తెలిసింది. మొదట 390 మందిని ఔట్‌సోర్సింగ్ విధానంలో నియమించుకునేందుకు మ్యాన్‌పవర్ సప్లయర్స్‌కు బాధ్యతను అప్పగించింది.