
బీసీ స్టడీ సర్కిల్‌లో ఆర్ఆర్బీ, ఎస్‌ఎస్‌సీ, బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ ఫౌండేషన్ కోర్సు కోసం ఉచిత శిక్షణ అందుబాటులో ఉందని జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జగదీష్ తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఫిబ్రవరి 9లోగా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సూచించారు.
దరఖాస్తు లింక్: www.bcstudycircle.cgg.gov.in
దరఖాస్తు చేసిన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ఫిబ్రవరి 12 నుంచి 14 వరకు జరుగుతుందని వివరించారు. ఈ అవకాశాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.