Sanna Biyyam

Sangareddy News : చౌటకూర్ మండలం, పోసానిపల్లి గ్రామం భూభారతి రెవెన్యూ సదస్సు ను జిల్లా కలెక్టర్ సందర్శించి నిర్వహణ తీరును శుక్రవారం పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు రైతులతో మాట్లాడారు. భూభారతి విశిష్టతను
తెలియజేశారు. రైతులతో ముఖాముఖి మాట్లాడి,వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. భూ భారతి చట్టంలోని అంశాలను వివరిస్తూ, రైతుల సందేహాలను నివృత్తి చేశారు. భూభారతి రెవెన్యూ సదస్సు
దరఖాస్తుల స్వీకరణ పూర్తయిన అనంతరం క్షేత్రస్థాయి పరిశీలన,విచారణ కోసం వచ్చే రెవెన్యూ బృందాలకు సహకరించాలని కలెక్టర్ సూచించారు.భూభారతి చట్టం లో ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుందని, అందుకు రెవిన్యూ అధికారులు రైతులకు పూర్తిగా సేవలను అందిస్తారని అన్నారు. అర్జీలు సమర్పించేందుకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు.

విద్యార్థులను ప్రభుత్వ విద్యాసంస్థల్లో చేర్పించాలి

జిల్లాలో బడిబాట కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నట్లు తెలిపారు.

ఈ సందర్బంగా చౌటకూర్ మండలం, పోసానిపల్లి గ్రామం నిర్వహించిన బడిబాట కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, అదనపు కలెక్టర్ రెవెన్యూ మాధురి, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్ల తో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు మాట్లాడుతూ నాణ్యమైన విద్య ప్రభుత్వ పాఠశాలల ద్వారా మాత్రమే సాధ్యమని విద్యార్థుల సంఖ్య పెంపే లక్ష్యంగా సర్కారు బడుల్లో సౌకర్యాలను మెరుగుపరిచి ఊరు వాడ తిరిగి బడి ఈడు పిల్లలందరినీ పాఠశాలల్లో చేర్పించే విధంగా కృషి చేస్తున్నామన్నారు.

ప్రభుత్వ పాఠశాల
ప్రాముఖ్యత ,ప్రభుత్వ పాఠశాలల ప్రయోజనాలు గురించి, పాఠశాలల్లో కల్పించే మౌలిక వసతులు, విద్యార్థినీ విద్యార్థులకు యూనిఫార్మ్స్, టెస్ట్ అండ్ నోట్ బుక్స్, అందించుట
కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు రూపుదిద్దుకుంటూ సదుపాయాలు మెరుగుపరుస్తూ విద్యార్థులకు నాణ్యమైన గుణాత్మక విద్య అందిస్తున్నామని బడి ఈడు పిల్లలందరూ బడిలో చేరాలని,బడిబాట కార్యక్రమంలో తల్లిదండ్రులు భాగస్వామ్యం కావాలని సూచించారు.

గ్రామ ప్రజలకు విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం కల్పించాలని అధికారులను ఆదేశించారు.

ప్రజలు ప్రభుత్వ పాఠశాలల్లో
పిల్లలను చేర్పించడానికి ముందుకు రావాలని దీని ద్వారా విద్య యొక్క ప్రాముఖ్యతను పెంచడం లక్ష్యంగా ముందుకు పోతున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *