
Sadashivpet News : ఆత్మకూర్ లో ఘనంగా ఆవిర్భావ దినోత్సవం
భారతీయ జనతా పార్టీ 45వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సదాశివపేట మండలంలో ఆత్మకూర్ గ్రామంలో బూత్ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కౌన్సిల్ సభ్యులు సుధాకర్ మాట్లాడుతూ.. 1980 ఏప్రిల్ 6న డాక్టర్ శామప్రసాద్ ముఖర్జీ,పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ,అటల్ బిహారీ వాజ్పేయి,ఎల్.కె.అద్వానీ ల ఆశయాలతో ప్రారంభమైన పార్టీ ప్రస్థానం నేడు అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రపంచంలోనే అత్యధికమైన కార్యకర్తలు గల పార్టీగా అవతరించిందని, ఏకాత్మ మానవతావాద సైద్ధాంతిక పునాదుల మీద ఏర్పడి దేశ నిర్మాణంలో సమర్పిత భావంతో.. అంకుటిత దీక్షతో కృషి చేస్తూ సమస్యల పరిష్కారానికి అలుపెరుగని పోరాటం చేస్తూ దేశానికి పూర్వ వైభవం తీసుకొచ్చి భారతదేశాన్ని ప్రపంచ దేశాల ముందు విశ్వ గురువుగా నిలబెట్టడమే ఏకైక లక్ష్యంగా ముందుకు సాగుతుందని ఇలాంటి గొప్ప సిద్ధాంతం గల పార్టీలో పని చేయడం మనం చేసుకున్న అదృష్టమని ఆయన పార్టీని కొనియాడారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నారని వీటన్నిటిని ప్రజలకు చేరవేయవలసిన బాధ్యత కార్యకర్తలమైన మనందరిపై ఉందని అన్నారు. బిజెపి ఎక్కడ ఉంది అని అవహేళన చెసే రాజకీయ నాయకులు బిజెపి ఉంది దాని దాటికి తట్టుకోలేమేమో అనే స్థాయికి ఈరోజు గ్రామాలలో పట్టణాలలో …భారతీయ జనతా పార్టీ ఎదిగిందని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కచ్చితంగా మెజార్టీ స్థానాలు సంపాదించుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శక్తి కేంద్ర ఇన్చార్జ్ సుభాష్, బూత్ అధ్యక్షులు ప్రశాంత్, శివకృష్ణ ,కిరణ్, సుధాకర్ ,సీనియర్ నాయకులు మనోహర్, దుర్గరాజ్ ,అభిలాష్,చంద్రశేఖర్ ,జగదీశ్వర్ ,రాజశేఖర్ ,ప్రవీణ్, మల్లేశం ,నాగరాజు ,బాలరాజు ,సువాస్, చంద్రశేఖర్ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.