18/02/2026
aa (3)

అకాల వర్షానికి నష్టపోయిన రైతులకు ఎకరానికి 30 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని బి కే ఎం యు జిల్లా కౌన్సిల్ సభ్యులు ఎం గంగమ్మ డిమాండ్ చేశారు. బుధవారం పార్టీ కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆమె మాట్లాడుతూ గత నెలరోజుల నుండి. నిరంతరం కురుస్తున్న అకాల వర్షాలకు పంటలన్నీ పూర్తిగా దెబ్బతిని మునిగిపోయాయని మునిగిపోయిన పంటలకు ఎకరానికి 30 వేల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని బి కే ఎం డిమాండ్ చేశారు. గత నెల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పత్తి పెసర. మినుము. తోగాళ్లు. వరి. పంటలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయని రైతులు ఎన్నో కష్టాలుపడి పెట్టిన పెట్టుబడి అంతా నీలపాలయ్యింది రైతులు బతకడం కష్టమైపోయింది వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రైతు బాధల్ని తెలుసుకొని నష్ట పోయిన రైతాంగానికి ఎకరాకు 30,000 వేల చొప్పున నష్ట పర్యాయ రామ్ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని అన్నారుఈ కార్యక్రమంలో k వినోద పత్తి మల్లమ్మ కావేలి గూడ నాగమణి తదితరులు పాల్గొన్నారు
ఫోటో రైట్ అప్. సమావేశంలో మాట్లాడుతున్న బి కే ఎం యు జిల్లా కౌన్సిల్ సభ్యులు గంగమ్మ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *