Sadashivpet News : సదాశివపేట మండలంలోని గొల్లగూడెం గ్రామ నూతన సర్పంచ్ మునిగె సుజాత నవీన్ ల కుమార్తె మునిగె ప్రణయ శ్రీ పుట్టినరోజు వేడుకల్లో సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్ గురువారం పాల్గొన్నారు.

అనంతరం చిన్నారిని ఎమ్మెల్యే చింతా ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. తర్వాత చిన్నారి కుటుంబ సభ్యులతో స్థానిక ప్రజలతో కాసేపు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ అశోక్ కుమార్, వార్డు సభ్యులు శోభ, అనిత, నాయకులు నాగరాజు, రాజు, అశోక్, వెంకటేష్, నరేష్, ప్రవీణ్, శ్రీను, నర్సింలు, రామచందర్, శ్రీశైలం, సర్వేష్,పలువురు బి.ఆర్.ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
