18/02/2026
Sangareddy News

Sangareddy News : విద్యారంగాన్ని బలోపేతం చేస్తూ అన్ని ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులకు సకల సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్య అందించే దిశగా ప్రభుత్వ చర్యలు , ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు వేగవంతం చేయాలని , రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బంది సమయపాలన పాటించాలనిజిల్లా కలెక్టర్ పి . ప్రావీణ్య అన్నారు.

గురువారం మండల కేంద్రమైన కొండాపూర్ లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లను, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయ తరగతి గదులు, రిజిస్టర్లు, వంటశాల, సామాగ్రి భద్రపరచు గది, పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భముగా కలెక్టర్ మాట్లాడుతూ … ప్రభుత్వ పాఠశాలలను సకల సదుపాయాలు కల్పించి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా మధ్యాహ్నం భోజనంలో మెనూ ప్రకారం పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించడం జరుగుతుందని, విద్యార్థులకు శుద్ధమైన త్రాగునీటిని అందించాలని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల పర్యవేక్షిస్తూ ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించాలని తెలిపారు. విద్యార్థులు క్రమం తప్పకుండా తరగతులకు హాజరయ్యేలా ఉపాధ్యాయులు పర్యవేక్షించాలని, విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో పాఠ్యాంశాలు బోధించాలని, తరగతిలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. మధ్యాహ్న భోజనం తయారీలో నాణ్యమైన నిత్యవసర సరుకులు, తాజా కూరగాయలను వినియోగించాలని, వంట సిబ్బంది పరిశుభ్రత నిబంధనలు పాటించాలని తెలిపారు. వర్షాకాలం అయినందున సీజనల్ వ్యాధుల నియంత్రణలో భాగంగా వ్యక్తిగత పరిశుభ్రత పై విద్యార్థులకు అవగాహన కల్పించాలని తెలిపారు. పాఠశాల పరిసరాలలో పారిశుద్ధ నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని సిబ్బందికి సూచించారు.

అనంతరం మండలకేంద్రంలోని పి హెచ్ సి ఆరోగ్య కేద్రాన్ని ,ఇందిరమ్మ గృహ నిర్మాణాలను ఆకస్మికంగా సందర్శించారు . ఈ సందర్భముగా పి హెచ్ సీ ను కలెక్టర్ తనిఖీ చేసి, ఔట్ పేషెంట్, ఇన్ పేషెంట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. జనరల్ వార్డ్ ను పరిశీలించారు. ఆస్పత్రి కి వచ్చిన రోగులతో మాట్లాడి వైద్య సేవలు ఎలా అందుతున్నాయని ఆరా తీశారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు. వర్షాలు పడుతున్నందున సిజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా గ్రామాలలో జ్వర సర్వే లాంటి కార్యక్రమాలు నిర్వహించడం రీజనల్ వ్యాధులు వృద్ధి చెందకుండా ప్రజలకు అవగాహన కలిగించడం, మురుగునీరు గ్రామాల్లో నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది కలెక్టర్ ఆదేశించారు.ఆస్పత్రికి అవసరమైన రిక్వైర్మెంట్ లు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. పి హెచ్ సి కాంపౌండ్ వాల్ కు సంబందించిన వివరాలు అడిగితెలుసుకున్నారు .

ఇందిరమ్మ ఇండ్లకు బిల్లుల చెల్లింపు లో జప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ పి. ప్రావీణ్య ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్లను పరిశీలిస్తూ నిర్మాణపు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు . గ్రామంలో మొత్తం ఎన్ని ఇండ్లు మంజూరు చేయడం జరిగింది , అందులో ఎన్ని నిర్మాణాలలో ఉన్నాయో, ఎన్ని స్లాబ్ లెవల్ లో ఉన్నాయి , ఎన్ని బేస్మెంట్ లెవల్ ఉన్నాయ అని ఎంపీడీఓ ని అడిగి తెలుసుకున్నారు.బేస్మెంట్ లెవల్, లెంటల్ లెవల్ వరకు పూర్తి అయిన వారికి లబ్ధిదారుల అకౌంట్ లలో డబ్బులు జమ అయ్యాయా అని తెలుసుకున్నారు.ఇంకా ఫోటో కాప్చర్ చేయనవి ఉంటే ఆలస్యం చేయకుండా వెంటనే చేయాలని హౌసింగ్ ఏఈ లను ఆదేశించారు. గ్రామంలో ఎన్ని ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయి , అవి ఏ ఏ దశల్లో వున్నాయి అని పరిశీలించారు.

ఈ కార్యక్రంమలో మండల పరిషత్ అధికారి, వేణు గోపాల్, తహసిల్దార్ అశోక్,, ఆత్మ కమిటీ చైర్మన్ మాధవరెడ్డి, గృహ నిర్మాణ శాఖ అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *