Sangareddy News : శనివారం హైదరాబాద్ నందు హైటెక్ సిటీ హాల్ నెంబర్ 4 నందు ట్రస్మ ఆధ్వర్యంలో కీర్తిశేషులు జి పుల్లారెడ్డి గారి స్కూల్ ఫస్ట్ ఈటిటెక్ వారి సౌజన్యంతో సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణానికి చెందిన శాంతినికేతన్ విద్యాలయానికి కూడా ఈ ( ET TECH School Excellence Award ) ( ఈ టి టెక్ స్కూల్ ఎక్సలెన్స్ )అవార్డు రావడం చాలా గర్వంగా ఉంది..అని పాఠశాల యాజమాన్యం కరస్పాండెంట్ మాలి పటేల్ ప్రభు హర్షం వ్యక్తం చేశారు.రాష్ట్రంలోని బడ్జెట్ పాఠశాలల కరెస్పాండెంట్లకు ప్రోత్సాహకంగా ప్రోత్సహిస్తున్న ఈ సంస్థకు బడ్జెట్ పాఠశాలల కరస్పాండెంట్లు అందరూ కూడా రుణపడి ఉంటారన్నారు. అనునిత్యం విద్యార్థులకు విద్యాబోధన అందించడానికి సాయశక్తుల కృషి చేస్తూ ఆర్థిక ఒడిదుడుకుల ను దిగమింగుతూ సేవలు చేస్తున్న కరెస్పాండెంట్లను గుర్తిస్తున్నటువంటి స్కూల్ ఫస్ట్ సంస్థకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అని తెలిపారు. ఈ కార్యక్రమం నందు పాఠశాల కరెస్పాండెంట్ మాలి పటేల్ ప్రభు ప్రిన్సిపల్ అరవింద శ్రీ తో పాటు సుమారు 300 మంది కరస్పాండెంట్లు పాల్గొన్నారు.
