18/02/2026
సైబరాబాద్ పోలీసులు వాట్సాప్ ద్వారా ఎఫ్ఐఆర్ కాపీ అందజేస్తున్నారు

Latest News : అవినీతి నివారణకు వినూత్న చర్యలు..సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ప్రజలకు ఎఫ్ఐఆర్ కాపీలు అందించే విధానంలో పెద్ద మార్పు చేసింది. ఇకపై బాధితులు పోలీస్ స్టేషన్‌ చుట్టూ తిరుగుతూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా, ఎఫ్ఐఆర్ కాపీ నేరుగా బాధితుడి మొబైల్‌కు వాట్సాప్ ద్వారా పంపించనున్నారు.

కమిషనర్ అవినాష్ మొహంతి ఆదేశాలు

సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మొహంతి ఆదేశాల మేరకు ఈ కొత్త విధానం ప్రారంభమైంది. ఫిర్యాదు చేసిన వెంటనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి, దానిని బాధితుడి ఫోన్ నంబర్‌కి వాట్సాప్‌లో పంపుతున్నారు. దీని వల్ల అవినీతి అవకాశం తగ్గుతుందని అధికారులు తెలిపారు.

సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక సౌకర్యం

ఇప్పటికే ఈ విధానం ద్వారా 50 వరకు ఎఫ్ఐఆర్ కాపీలు పంపినట్లు సమాచారం. అంతేకాక, 60 సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్లకు వారి ఇంటి వద్దకే ఎఫ్ఐఆర్ కాపీలు అందజేస్తున్నారని పోలీసులు వెల్లడించారు.

ప్రజల స్పందన

“ఈ కొత్త విధానం వల్ల పోలీస్ సిబ్బందిపై నమ్మకం, గౌరవం పెరుగుతుంది” అని సీపీ అవినాష్ మొహంతి తెలిపారు. ప్రజలు ఈ సేవలపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *