Image Templatelon

చాలా మందికి కొన్ని అత్యవసర ఆర్థిక పరిస్థితులు ఏర్పడుతాయి. పెళ్లి, ఇంటి కొనుగోలు, వైద్య అవసరాల కోసం చాలా మంది లోన్ తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఇలాంటి సందర్భాల్లో గోల్డ్ లోన్ లేదంటే.. పర్సనల్ లోన్‌ వైపు మొగ్గు చూపుతారు. ఈ రెండు రకాల రుణాలకు లాభాలు, నష్టాలు ఉంటాయి. ఈ లోన్స్ కు సంబంధించి కాలపరిమితి, వడ్డీ రేట్లు, రుణ పరిమితులకు సంబంధించిన వివరాలను చూద్దాం..

గోల్డ్ లోన్ అంటే ఏంటి?

అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక అవసరాలను తీర్చేందుకు బంగారాన్ని కుదవపెట్టి తీసుకునే రుణం. బంగారు నాణేలు, నగలును పూచీగా పెట్టాలి. బంగారం విలువలో 75 నుంచి 80 శాతం రుణాన్ని అందిస్తుంది. బ్యాంకులు లోన్-టు-వాల్యూ నిష్పత్తి ప్రకారం రుణాన్ని ఇస్తారు.  మీరు EMIల ద్వారా వడ్డీతో పాటు మొత్తాన్ని తిరిగి చెల్లించవచ్చు. పూర్తి చెల్లింపు చేసిన తర్వాత, బ్యాంకు తాకట్టు పెట్టిన బంగారాన్ని తిరిగి ఇస్తుంది.

గోల్డ్ లోన్ తో లాభాలు  

సాధారణంగా, గోల్డ్ లోన్ల వడ్డీ వ్యక్తిగత రుణాల కంటే తక్కువగా ఉంటుంది. చాలా త్వరగా లోన్ పొందే అవకాశం ఉంటుంది. ఇతర సెక్యూర్డ్ రుణాల మాదిరిగా కాకుండా, బంగారు రుణానికి సంబంధించిన వినియోగం మీద ఎలాంటి పరిమితులు ఉండవు. ముఖ్యంగా క్రెడిట్ హిస్టరీ గురించి పరిశీలించాల్సిన అవసరం లేదు. సౌకర్యవంతమైన చెల్లింపులు చేసేలా ఉంటుంది.  సాధారణంగా గోల్డ్ లోన్స్ మీద వడ్డీ రేట్లు 9 శాతం నుంచి మొదలవుతాయి.

గోల్డ్ లోన్ తో నష్టాలు  

ఒకవేళ మీరు రుణాన్ని పూర్తిగా చెల్లించలేని పక్షంలో బంగారాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది.  బంగారం విలువలో 75 నుంచి 80 శాతమే రుణం లభిస్తుంది.

పర్సనల్ లోన్ అంటే ఏంటి?

పర్సనల్ లోన్స్ ను బ్యాంకులు  అన్‌ సెక్యూర్డ్ రుణాలుగా భావిస్తుంది. అంటే, ఈ లోన్ ను పొందేందుక ఎలాంటి పూచీకత్తు ఇవాల్సిన అవసరం లేదు. మీ క్రెడిట్ స్కోర్ ఆధారంగా లోన్ అందిస్తారు. అన్నీ విషయాలను పరిగణలోకి తీసుకోవడంతో పాటు  క్రెడిట్ స్కోరు మెరుగ్గా ఉంటే రుణం త్వరగా ఇస్తారు. సాధారణంగా పర్సనల్ లోన్స్ మీద 10.5 శాతం నుంచి వడ్డీ రేట్లు మొదలవుతాయి.

పర్సనల్ లోన్ తో లాభాలు  

ఈ లోన్ కోసం ఆస్తిని తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు. మీ క్రెడిట్ స్కోర్, ఆదాయాన్ని బట్టి ఎక్కువ మొత్తంలో లోన్ తీనుకునే అవకాశం ఉంటుంది.  ఈ మొత్తాన్ని దేనికైనా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది.

పర్సనల్ లోన్ తో నష్టాలు 

పర్సనల్ లోన్ కు గోల్డ్ లోన్ తో పోల్చితే వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి.  క్రేడిట్ స్కోర్ సరిగా లేకపోతే రుణం లభించదు.

గోల్డ్ లోన్, పర్సనల్ లోన్ లో ఏది బెస్ట్?  

గోల్డ్ లోన్ సెక్యూర్డ్ లోన్. మీరు బంగారాన్ని తాకట్టు పెట్టాల్సి ఉంటుంది. వ్యక్తిగత రుణానికి పూచీకత్తు అవసరం లేదు. గోల్డ్ లోన్ వడ్డీ రేటుతో పోల్చితే పర్సనల్ లోన్ ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ. పర్సనల్ లోన్ కు ప్రాసెసింగ్ ఛార్జ్ లోన్ మొత్తంలో 2శాతం అంతకంటే ఎక్కువ ఉంటాయి. ప్రీ పేమెంట్ ఛార్జీలు 5 శాతం వరకు ఉంటాయి. గోల్డ్ లోన్ ప్రాసెసింగ్ ఛార్జ్ లోన్ మొత్తంలో 1 శాతం ఉటుంది. ప్రీ పేమెంట్ ఛార్జ్ కూడా 1 శాతం ఉటుంది.  గోల్డ్ లోన్ మొత్తం రూ. 25 లక్షల వరకు ఉంటుంది. పర్సనల్ లోన్  క్రెడిట్ స్కోర్, ఆదాయాన్ని బట్టి రూ. 50 వేల నుంచి రూ, 20 లక్షల వరకు తీసుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *