18/02/2026
సదాశివపేట మండలంలోని గ్రామాల్లో లబ్ధిదారులకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేస్తున్న కాంగ్రెస్ నాయకులు

Sadashivpet News : టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జయప్రకాష్ రెడ్డి, టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి ఆదేశాల మేరకు సోమవారం సదాశివపేట మండలం ఆత్మకూరు,ఎల్లారం,కంబాల పల్లి,నందికంది,తంగేడు పల్లి,మద్దికుంట,తదితర గ్రామలలో ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, గత ప్రభుత్వం మహిళల సంక్షేమాన్ని విస్మరించిందని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి అన్ని వర్గాల సంక్షేమానికి పథకాలు అమలు చేస్తున్నారని, మహిళలందరికీ నాణ్యమైన చీరలను అందజేస్తున్నామని తెలిపారు. లబ్ధిదారులు ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *