Latest News : పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు శుభవార్త తెలిపింది. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అడ్మిషన్ల దరఖాస్తు గడువును మరోసారి పొడిగిస్తూ ఆగస్టు 31, 2025 వరకు అవకాశం కల్పించింది.
ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసిన తాజా సర్క్యులర్ ప్రకారం, విద్యార్థులు ఇంటర్ బోర్డు అఫిలియేషన్ ఉన్న కళాశాలల్లోనే అడ్మిషన్లు తీసుకోవాలని సూచించింది. తల్లిదండ్రులు మరియు విద్యార్థులు తప్పనిసరిగా బోర్డు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్న గుర్తింపు పొందిన ఇంటర్ కళాశాలల జాబితాని పరిశీలించాలని అధికారులు సలహా ఇచ్చారు.
ముఖ్య సూచనలు
ఇంటర్మీడియట్ అడ్మిషన్ల గడువు : ఆగస్టు 31, 2025 వరకు
కేవలం అధికారికంగా గుర్తింపు పొందిన కళాశాలల్లోనే అడ్మిషన్లు తీసుకోవాలి
కళాశాలల జాబితా ఇంటర్ బోర్డు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంది.
