Sangareddy News : సంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి జిల్లా కోర్టు ప్రాంగణంలో న్యాయవాదుల సమక్షంలో అందరి న్యాయవాదులను న్యాయవస్థను దృష్టిలో ఉంచుకొని న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ అందరి న్యాయవాదుల పరిజ్ఞానాన్ని సేవలను ప్రజా సమస్యలను పరిష్కరించడం కోసం న్యాయవాదులను ప్రతి మండలానికి లీగల్ అడ్వైజర్లుగా నియమించడం జరుగుతుందని టీఎస్ లా న్యూస్ లీగల్ అడ్వైజర్లు, టీఎస్ లా న్యూస్ రిపోర్టర్లకు దిక్సూచిగా ప్రజా సమస్యలను పరిష్కరించడం కోసం బాధ్యతాయుతంగా ప్రణాళిక బద్ధంగా పనిచేస్తారని తెలియజేశారు.ఈ యొక్క సమావేశంలో హైకోర్టు అడ్వకేట్ కోమల సంతోష్ కుమార్ గారు, అడ్వకేట్ సయ్యద్ నజీమ్ గారు, సంగారెడ్డి జిల్లా కోర్ట్ అడ్వకేట్ పరంపర రావు గారు, జూనియర్ అడ్వకేట్ శ్రీరాములు, టీఎస్ లా న్యూస్ మెదక్ జిల్లా చీఫ్ అడ్వైజర్ బీఎస్సీ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షులు నగులూరి స్వామి దాస్ గారు, మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కాంటెస్టెడ్ ఎంపీ జీ సాయ గౌడ్ గారు, రిపోర్టర్ సందీప్ గౌడ్ మరియు అడ్వకేట్లు పాల్గొన్నారు.
