
Sangareddy News : మెదక్ ఎంపీ రఘునందన్ రావు జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సోమవారం ‘మన పాఠశాల మన ఆత్మగౌరవం’ కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. సంగారెడ్డిలో తపస్ ఆధ్వర్యంలో రూపొందించిన కరపత్రాలను ఆదివారం ఆవిష్కరించారు. మన పాఠశాల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు ఈ కార్యక్రమం అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్, నాయకులు మాధవరెడ్డి పాల్గొన్నారు.