Sadashivpet News : సదాశివపేట మండలంలో ని పెద్దా పూర్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టి సీనియర్ నాయకులు ప్రభాకర్ భార్య ఇటీవల మృతి చెందడంతో విషయం తెలుసుకున్న సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్ బుధవారం గ్రామానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.తాను,పార్టీ మీకు అండగా ఉంటుందని …దిగులు చెందకుండా ఉండాలని ప్రభాకర్ కు ఎమ్మెల్యే ధైర్యం చెప్పారు.బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ పార్టీ ఆపద కాలంలో భరోసగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట మండల పార్టీ అధ్యక్షులు పెద్దగొల్ల ఆంజనేయులు, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అమరేందర్ రెడ్డి ,మండల యువత అధ్యక్షులు నరేష్ గౌడ్, ఎస్సీ సెల్ అధ్యక్షులు బేగరి సుధాకర్ ,గ్రామ మాజీ ఎంపిటిసి రాములు ,గ్రామ మాజీ సర్పంచులు బోయిని శ్రీనివాస్ , రాజేశ్వర్, ఆంజయ్య ,గ్రామ పార్టీ అధ్యక్షులు సామెల్ , నాయకులు బాలరాజ్ గౌడ్ ,ప్రభూ ,మొగులయ్య ,బుచ్చయ్య ,రాజ మల్లయ్య తదితర నాయకులు ఉన్నారు.
