Sangareddy News : కొండాపూర్ మండలం మునిదేవునిపల్లి గ్రామంలోని సర్వే నంబర్ 92లో TGIIC ద్వారా పరిశ్రమ ఏర్పాటు కారణంగా భూములు కోల్పోతున్న రైతులకు తగిన పరిహారం ఇవ్వాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారిని భూ బాధితులు కలిశారు…
శుక్రవారం సంగారెడ్డి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ను కలిసి వినతి పత్రం అందజేశారు…
పరిశ్రమల లో కోల్పోతున్న భూముల మీదనే కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని, భూములు తీసుకుంటే కొన్ని కుటుంబాలు రోడ్డున పడతాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు…
భూములు కోల్పోతున్న వారికి పరిహారం తెలియజేసిన తరువాతే భూమిని సర్వే చేయాలని తెలిపారు…ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలని,అలాగే ఒక ప్లాట్ ఇవ్వాలని ,సాగులో ఉన్న భూమికి సాధనంగా పరిహారం చెల్లించాలని తెలిపారు…
ఎట్టి పరిస్థితుల్లో కెమికల్ కంపెనీలు ఏర్పాటు చెయ్యోదని తెలిపారు…
ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు మాట్లాడుతూ…
పరిశ్రమలో కోల్పోతున్న భూములు పూర్తిగా సాగు చేస్తున్నటువంటి భూములని, వారికి సరైన పరిహారం చెల్లించకుంటే వారి కుటుంబాలు రోడ్డున పడతాయని కలెక్టర్ కు వివరించినట్లు ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు…
గ్రీన్, & ఆరెంజ్ లో ఉన్నందున కెమికల్ పరిశ్రమలు ఏర్పాటు చేయమని ఎమ్మెల్యే కు కలెక్టర్ తెలిపినట్లు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు పేర్కొన్నారు.
స్థానికులు ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా కృషి చేస్తామని చెప్పారు…
కార్యక్రమంలో కొండాపూర్ మండల మాజీ వైస్ ఎంపీపీ చంద్రయ్య, రైతులు ఉన్నారు.
