Sadashivpet News : సదాశివపేటకు చెందిన 4 వ వార్డులోనీ ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు ఫర్వీన్ సుల్తానా ఖాజాపాషా ల ఇంటిని నిర్మల జగ్గారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం కృషి చేస్తుందన్నారు.
పేదవారి ఇంటికలను నిజం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేతల్లో చూపించడం జరిగింది అన్నారు.
లబ్ధిదారులు పర్వీన్ సుల్తానా కాజా పాషా మాట్లాడుతూ జీవితంలో మేము సొంత ఇంటిని నిర్మించుకుంటామని కలలు కూడా ఊహించలేకపోయాం అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా మా కల నిజం కావడం చాలా సంతోషకరమన్నారు.
టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మరియు టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి కి మా జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిడిసి చైర్మన్ గడీల రాంరెడ్డి, పట్టణ అధ్యక్షుడు మునిపల్లి సత్యనారాయణ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిరు, కాంగ్రెస్ నాయకులు పిల్లోడి విశ్వనాథం, ఇందిరమ్మ కమిటీ వార్డు ఇన్చార్జిలు మోహిస్, ముస్తఫా, శరత్, సజ్జి, శంకర్ గౌడ్, కొత్త గొల్ల చంద్రశేఖర్, పట్నం సుభాష్ , గుండు రవి, అరుణ్, వీరన్న, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
