Zaheerabad News : ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ మాట్లాడుతూ—జిల్లా ప్రజల శాంతి-భద్రతలే ప్రథమ కర్తవ్యము అని, జిల్లా వ్యాప్తంగా ప్రజా శాంతికి భంగం కలిగించే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరగకుండా కమ్యూనిటీ కాంటాక్ట్, నాకాబందీ వంటి కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తున్నాము అని అన్నారు.
ఇందులో భాగంగానే జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారం – పటాన్ చెర్వు పోలీస్ స్టేషన్ పరిధిలో గల వీకర్ సెక్షన్ కాలనీ, రామేశ్వరం బండా గ్రామంలో ఇతర జిల్లాలకు, రాష్ట్రాలకు చెందిన వలసదారులు అధిక సంఖ్యలో నివాసం ఉంటున్నారని, వివిధ రాష్ట్రాల, జిల్లాలకు చెందిన వ్యక్తులు నివసించడం వలన నేరస్తులు తలదాచుకొనే అవకాశం ఉంటుందని, ఈ ప్రదేశంలో దొంగిలించిన ఆస్తులు, అనుమానాస్పద వస్తువులు నిల్వ చేయడానికి అవకాశం ఉంటుందని, పటాన్ చెర్వు డిఎస్పీ ప్రభాకర్ ఆధ్వర్యంలో సుమారు 220 మంది పోలీసులతో మొత్తం కాలనీని 4 భాగాలు అవుటర్ కార్డన్లు, హోల్డింగ్ పాయింట్, కట్-ఆఫ్ పాయింట్లు, శోధనా బృందాలుగా విభజించి, ఈ రోజు తేది: 15.11.2025 నాడు ఉదయం 4.30 గంటలకు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది అన్నారు.
ఈ సర్చ్ లో 205 మంది అనుమానితులను పాపిలాన్ డివైజ్ ద్వారా పరీక్షించి, అందులో 4 – వ్యక్తులు గతంలో నేర చరిత్ర గల వ్యక్తులను గుర్తించడం జరిగింది. 62 – మోటార్ సైకిళ్లు, 17 – ఆటోలు, ఒక కారు అనుమానాస్పదంగా స్వాధీనం చేసుకొని, 15 – వాహనాలకు జరిమానా విధిస్తూ, 17 – వాహనాల పెండింగ్ చలాన్లు క్లియర్ చేయించడం జరిగింది.
జహీరాబాద్:- ఇతర రాష్ట్రాలతో సరిహద్దును కలిగి ఉండటం వలన వివిధ రకాల నేరస్తులు తలదాచుకొనే అవకాశం ఉంటుందని, ఈ ప్రదేశంలో దొంగిలించిన ఆస్తులు, అనుమానాస్పద వస్తువులు నిల్వ చేయడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశ్యంతో జిల్లా అదనపు ఎస్పీ రఘునందన్ గారి ఆధ్వర్యంలో జహీరాబాద్ డిఎస్పీ సైదానాయక్, ఇన్స్పెక్టర్స్, సబ్- ఇన్స్పెక్టర్స్, సిబ్బంది మొత్తం 150 మందితో జహీరాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని భరత్ నగర్ కాలనీలో ఈ రోజు ఉదయం 5.00 గంటలకు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించి, సరైన పత్రాలు లేని అనుమానాస్పద వాహనాలు 32 – బైకులు, 14 – ఆటోలు, 2 – కార్స్ ను స్వాధీన పరచడం జరిగింది. ఈ కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రామ్ లో భాగంగా ప్రజలకు సైబర్ క్రైమ్, ప్రస్తుతం జరుగుతున్న వివిధ రకాల నేరాల గురించి అవగాహన కల్పించడం జరిగింది.
జిల్లా ప్రజలు మీ ప్రాంతాలలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులను గాని, అనుమానాస్పద వస్తువులను గమనించిన వెంటనే సంబంధిత పోలీసు స్టేషన్లో సమాచారం అందించవలసిందిగా జిల్లా ఎస్పీ గారు సూచించారు.
