
Sangareddy News : సదాశివపేట మున్సిపాలిటీలో నిషేధిత పాలిథిన్ కవర్లను వాడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ శివాజీ ఆదివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. పాలిథిన్ కవర్లపై తనిఖీలు చేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. వ్యాపారులు జ్యూట్, బట్ట బ్యాగులను మాత్రమే ఉపయోగించాలని సూచించారు.