Sadashivpet News : సదాశివపేట పట్టణంలోని షెడ్ది వినోద్ ,శ్వేత దంపతుల కుమారుడు చిన్నారి హరిహరన్ (4) అతి చిన్న వయసులో శివదీక్ష తీసుకొని అందరిని ఆకట్టుకుంటున్నాడు. 41 రోజులపాటు కఠోరమైన శివదీక్ష నియమాలు పాటించి శనివారం దీక్ష ఇరుముడిని కట్టుకొని శ్రీశైల పుణ్యక్షేత్రానికి బయలుదేరి వెళ్ళాడు. చిన్నపిల్లలు మొబైల్ ఫోన్లు చూస్తూ కాలక్షేపంతో చదువును నిర్లక్ష్యం చేస్తున్న ఈ రోజుల్లో నాలుగు సంవత్సరాల అతి చిన్న వయసులో తల్లిదండ్రుల మాట బుద్ధిగా వింటూ 41 రోజు ప్లాటు శివదీక్ష చేపట్టి కఠినమైన నియమాలు పాటించి దీక్ష పూర్తి చేసిన హరిహరన్ ఇరుముడి నెత్తిన పెట్టుకొని శ్రీశైలానికి వెళ్లడం చూసిన భక్తులు అందరూ భక్తి భావంతో పులకించిపోయారు. చిన్నారి హరిహరన్ ముద్దు ముద్దు మాటలు… మాట్లాడుతూ ఓం నమశ్శివాయ నామస్మరణతో శ్రీశైల మల్లికార్జునుని దర్శనం కోసం బయలుదేరి వెళ్లడం పట్టణంలో చర్చనీయాంశమైంది. చిన్నారి హరిహరన్ శివ దీక్ష అలంకరణలో చూసిన ప్రజలంతా భక్తి భావంతో సంబర పడడం కనిపించింది.
