Sadashivpet News : సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో ఎనిమిదవ వార్డులో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ఎనిమిదవ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ చింటూ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ సమావేశం సమావేశంలో ఎనిమిదవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి సిహెచ్ రేణుక శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఎనిమిదవ వార్డులో అభివృద్ధిని కుముటు పట్టించిన ఘనత బిఆర్ఎస్(టీఆర్ఎస్) పార్టీ దేనని, ఎనిమిదవ వార్డు ప్రజల కష్టాలను సమస్యలను చూసి వారి కష్టాలను తీర్చడానికి, సమస్యలను పరిష్కరించడానికి, 8వ వార్డు అభివృద్ధిని చేయడానికి ఎనిమిదో వార్డు ప్రజల అండదండలతో ఆశీస్సులతో బరిలో ఉన్నానని, ఈ ఎన్నికల లో గెలుపు ఎనిమిదవ వార్డు ప్రజలు ఇచ్చే తీర్పే అవుతుందని అందుకు వార్డు అభివృద్ధికి ఇచ్చిన మాటను నిలబెట్టుకొని వార్డు అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతానని తెలియజేశారు. సమావేశంలో భాగంగా ఎనిమిదవ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చింటూ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని శ్రీ తూర్పు నిర్మల జయప్రకాష్ రెడ్డి గారి సూచనల మేరకు ఎనిమిదవ వార్డు అభివృద్ధి కొరకై వార్డు ప్రజలలో ఉన్న సమస్యలను పరిష్కరించుటకై , ఎనిమిదో వార్డును అభివృద్ధి చెందించుటకై, నిరుపేదలకు ఇండ్ల స్థలాలు ఇచ్చుటకై ఎనిమిదవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి సిహెచ్ రేణుక శ్రీనివాస్ గౌడ్ గారిని హస్తం గుర్తుకు ( చేతి) గుర్తుకు ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించుకోవాలని ఎనిమిదవ వార్డు ఓటర్ మహాశయులకు పిలుపునిచ్చారు. అదేవిధంగా న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ 8 వ వార్డులో మాయ మాటలు చెప్పి పూటకో వేషం వేస్తున్న నాయకులు బిఆర్ఎస్( టిఆర్ఎస్) నాయకులు అని, ప్రస్తుతం 8వ వార్డు బిఆర్ఎస్ (టిఆర్ఎస్)కౌన్సిలర్ అభ్యర్థి సోమశంకర్ ప్రచారంలో భాగంగా ఎనిమిదవ వార్డులో బిఆర్ఎస్(టిఆర్ఎస్) పార్టీ చేసిన అభివృద్ధి చెప్పుకోవడానికి ఏమి లేక, మాయమాటలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడని, ముసలి కన్నీరు కార్చే ప్రయత్నం చేస్తున్నాడని, అదేవిధంగా ఎనిమిదవ వార్డు ప్రజలకు గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేని చింత ప్రభాకర్ ఎటువంటి మొఖం చూపలేక ముసలి కన్నీరు నినాదంతో ఓటరు మహాశయులను మభ్యపెట్టి మోసం చేసే ఘనత చింత ప్రభాకర్ దేనిని మళ్లీ ఎనిమిదవ వార్డు ఓటర్ మహాశయులు మోసపూరిత మాటలకు లొంగకుండా తగిన గుణపాఠం నేర్పించాలని తెలియజేశారు. జరిగిన మోసాలను దృష్టిలో ఉంచుకొని 8వ వార్డు ఓటర్ మహాశయులు కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుకు ఓటు వేసి సిహెచ్ రేణుక శ్రీనివాస్ గౌడ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పేరుపేరునా విజ్ఞప్తి చేశారు. ఈ యొక్క ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఆత్మ కమిటీ డైరెక్టర్ రాములు గౌడ్, ఎనిమిదవ వార్డు బ్లాక్ ఇన్చార్జ్ మంజుల ఈశ్వర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు నవాజ్, రజాక్, యూసుఫ్, శ్రీశైలం గారు, వెంకటేశం, శంకర్ మరియు కాంగ్రెస్ పార్టీ మహిళామూర్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
