18/02/2026
ANM workload protest Hyderabad

ఏఎన్ఎంలపై పని భారాన్ని తగ్గించాలని ఈ నెల 15న హైదరాబాద్ లోని కమిషనరేట్ ఆఫ్ హెల్త్ కార్యాలయం ముందు నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎంఏ రహిమాన్ పిలుపునిచ్చారు. శనివారం సదాశివపేట మండలం లోని ఆత్మకూర్ గ్రామ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద గోడ పత్రికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వం, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రభుత్వం ఏఎన్ఎం ల పై పని భారం మోపడం సరికాదన్నారు. ఏఎన్ఎం లను ఆఫ్లైన్ తో ఆన్లైన తో పాటు ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ లను నమోదు చేయాలనీ ఇబ్బందులకు గురి చేయడం సరికాదు అని ఆరోపించారు. ఏఎన్ఎంలు రోజుకు 14 గంటల డ్యూటీ చేయాల్సి వస్తుంద న్నారు. అలా చేయడంతో వారు బిపి షుగర్ స్పాండలైసిస్ లాంటి దీర్ఘకాలిక రోగాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఆ సమస్య పరిష్కరించాలని అనేక రోజుల నుండి జిల్లా రాష్ట్ర అధికారుల దృష్టికి తీసుకపోయినా ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. కావున వెంటనే సమస్యలు పరిష్కరించాలని ఏఐటియుసి ఆధ్వర్యంలో 15న మెడికల్ అండ్ హెల్త్ కమిషనరేట్ కార్యాలయం ముందు నిర్వహించే ధర్నాకు పెద్ద ఎత్తున ఏఎన్ఎం తరలివచ్చి ధర్నాను జయప్రదం చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో ఏ ఎన్ ఎం లు స్వరూప, ఉమారాణి ,యాదమ్మ ,సంగీత, బి జ్యోతి , జ్యోతి శారద ,లతా, సంపూర్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *