Sadashivpet News : సదాశివపేట: సదాశివపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న డిగ్రీ సీట్ల కోసం వన్‌టైమ్ స్పాట్ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ప్రిన్సిపాల్ భారతి గురువారం వెల్లడించిన వివరాల ప్రకారం, బీబీఏ, బీకాం కంప్యూటర్, బీఏ, బీఎస్సీ మొదటి సంవత్సర కోర్సుల్లో ఖాళీ సీట్లను దోస్త్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల ఇంటర్ పాసైన విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో కళాశాలకు హాజరు కావాలని ఆమె సూచించారు.
