
Sadashivpet News : ఈరోజు తేదీ 15 4 2025 నాడు తెల్లవారుజామున 4 గంటల సమయంలో రేజింతల్ గ్రామ శివారులో గల డబల్ బెడ్ రూమ్ వెనకాల అక్రమంగా ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు లేకుండా అధికంగా తనర్జనే లక్ష్యంగా టిప్పర్ లారీలలో జెసిబి తో మట్టి తవ్వి సదాశివపేట పట్టణ పరిధిలో గల వివిధ వెంచర్లకు మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు అని నమ్మదగిన సమాచారం రాగా సదాశివపేట పోలీసు వారు అట్టి టిప్పర్ లారీ నెంబర్ TS05UC2943 మరియుTG08U4782 JCB NO. TS15FG8453 గలవాటి డ్రైవర్లను విచారించగా ఏడాకులపల్లి సుధాకర్ మోబిన్ మహమ్మద్ మరియు జెసిబి డ్రైవర్ మొహమ్మద్ గఫర్ వారి యొక్క యజమానులు కిరణ్ కుమార్ మరియు మేతరి సుభాష్ జెసిబి ఓనర్ ప్రమీల గార్ల ఆదేశాల మేరకు ఇట్టి మట్టిని అక్రమ రవాణా చేస్తున్నట్టు ఒప్పుకున్నారు రెండు టిప్పర్లు ఒక జెసిబి ని సీజ్ చేసి అనంతరం తగు చట్టరీత్య చర్య గురించి తాసిల్దార్ సదాశివపేట గారికి పంపనైనది అక్రమంగా ఎవరైనా మట్టిని త్రవ్వడం రవాణా చేయడం వంటి చర్యలకు పాల్పడినచో చట్టరీత్యా కఠినమైన చర్యలు తీసుకోబడతాయని సదాశివపేట పోలీస్ ఇన్స్పెక్టర్ గారు ఎం మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరించారు.