18/02/2026
yathra

Sadashivpet News : అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్) సంస్థాపక ఆచార్యులు భక్తి వేదాంత స్వామి భక్తి పద్మ సౌరబ్ ప్రచార స్వామి మహారాజ్ వారి దివ్య అనుగ్రహంతో పట్టణంలోని ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవమును ఈనెల 4 వ తేదీ బసవసేవాసధన్ కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్నట్లు స్థానిక ఇస్కాన్ నిర్వాహకులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ …ఈనెల 4వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు రథయాత్ర స్థానిక దుర్గమ్మ మందిరం నుండి ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ రథయాత్ర దుర్గమ్మ నుండి బసవాసేధన్ కళ్యాణ మండపం వరకు వెళుతుందని తెలిపారు. కళ్యాణ మండపంలో సాయంత్రం ప్రత్యేక భజనలు, తులసి పూజ జగన్నాథ లీలల ప్రవచనము అనంతరం ప్రసాద వితరణ ఉంటుందని తెలిపారు. రతాన్ని లాగడం ద్వారా జీవితములో సుఖశాంతులు కలిగించుకోవాలని తెలిపారు. ఈ ఉత్సవానికి విరాళంగా వస్తు రూపంలో గానీ ధన రూపంలో గానీ అందిస్తే తప్పక రసీదు పొందాలని తెలిపారు. మరిన్ని వివరాలకు సెల్ నెంబర్ కొన్ని కరపత్రాల్లో ముద్రించామని వాటిని సంప్రదించాలని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని భక్తాదులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *