Sadashivpet News : పట్టణం లోని లోపలి కోట హనుమాన్ మందిరంలో ఈశ్వర, నందీశ్వర, నవగ్రహ పునర్ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు నాగారం శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంగళవారం నాడు ఉదయం 9 గంటలకు మడుగుల సర్వోత్తమ శర్మ అర్చక బృందం చే ఆవాహిత దేవత పూజ, అష్టోత్తర108 కళాశాలతో మహోన్న వనం, మూల మంత్ర హోమంలో తదితర పూజలు నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు అన్నప్రసాద విస్తరణ చేశారు.20 న విగ్రహ ప్రతిష్ట ప్రత్యేక పూజలు నిర్వహించే కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని దైవ కృపకు పాత్రులు కావాలన్నారు.
హోమo లో పాల్గొన్న దంపతులు మాజీ కౌన్సిలర్ పట్లూరి నాగరాజ్ గౌడ్. మునిపల్లి వెంకటేశం. గుజ్జరిశంకర్. మునిపల్లి మాణిక్. గాజుల ప్రవీణ్ దంపతులచే హోమం పూజ కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి మఠం చంద్రశేఖర్, ఆలయ కమిటీ సభ్యులు పోల మనోహర్ నిర్మల, గాజుల అశోక్, బలరాజ్,జలరాం మనోహర్, గున్నాల సత్యనారాయణ, పోల సంగమేశ్వర, లోపలి కోట పద్మశాలి కులదైవ సంఘం అధ్యక్షులు మునిపల్లి రామకృష్ణ, పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు మునిపల్లి విశ్వనాథం, లోపలి కోట పద్మశాలీలు, భక్తులు పాల్గొన్నారు.
