Sadashivpet News : మున్సిపల్ ఎన్నికల బరిలో బి ఆర్ ఎస్ దూకుడు పెంచింది .16వ వార్డు నుంచి చింతాగోపాల్, 8వ వార్డు నుండి కొత్తగొల్ల సోమశేఖర్ బి ఆర్ఎస్ పార్టీ తరఫున తమ నామినేషన్ పత్రాలను అట్టహాసంగా దాఖలు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు,అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పాల్గొన్నారు. పలువురు అభ్యర్థులకు సంఘీభావం తెలిపారు.
నాయకుల్లో కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.బిఆర్ఎస్ పార్టి బలం ఐక్యతను చాటారు. 8వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి కొత్త గొల్ల సోమశేఖర్ భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి నామినేషన్ దాఖలు చేయడం చేశారు. సాయిబాబా గుడి సమీపంలో తన స్వగృహం నుండి కళాకారులచే, మహిళలు బోనాలతో, బతుకమ్మలతో అంగరంగ వైభవంగా ర్యాలీ నిర్వహించి, అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు.26వ వార్డ్ అభ్యర్థిగా అపర్ణ శివరాజ్ పాటిల్ నామినేషన్ కార్యక్రమంలో సదాశివపేట మున్సిపల్ ఎన్నికల అబ్జర్వర్ మాజీ కార్పొరేషన్ చైర్మన్ మఠం బిక్షపతి, సపనదేవ్, బిఆర్ఎస్ నాయకులు చింత సాయినాథ్, ఆత్మకూరు నగేష్, శివరాజ్ పాటిల్ , అమరేందర్ రెడ్డి, ,26వ వార్డు సభ్యులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని సంఘీభావం తెలిపారు. అంతకుముందు స్థానిక బసవేశ్వర మందిరంలో నామినేషన్ పత్రాలను పూజా కార్యక్రమం నిర్వహించి అక్కడి నుండి బసవేశ్వర చౌక్ వరకు ర్యాలీగా వెళ్లి నామినేషన్ సమర్పించారు.ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున వార్డు ప్రజలు పాల్గొన్నారు.నామినేషన్ ప్రక్రియలు మొత్తం ఉత్కంఠ భరితంగా కొనసాగగా, సదాశివపేట రాజకీయం ఒకేసారి వేడెక్కింది. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అధికారాన్ని లక్ష్యంగా చేసుకుని దూకుడు రాజకీయానికి శ్రీకారం చుట్టిందని నాయకులు వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలే ఎజెండాగా, అభివృద్ధి సంక్షేమ మే లక్ష్యంగా ఈ ఎన్నికలు ఎదుర్కొంటామని అభ్యర్థులు స్పష్టం చేశారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన శ్రేణులు బిఆర్ఎస్ పార్టీ విజయంపై ధీమా వ్యక్తం చేయ గా నామినేషన్ ప్రక్రియకు చివరి రోజైన శుక్రవారం సదాశివపేటలో రాజకీయం కీలక మలుపుగా మారిందని రాజకీయ నాయకులు విశ్లేషిస్తున్నారు.
