Sadashivpet News : సెప్టెంబర్ 21 ఆదివారం భాద్రపద బహుళ అమావాస్య “చూడామణి నామక” ఖండగ్రాస సంపూర్ణ సూర్య గ్రహణం ఉన్నది అని ప్రచారం జరుగుతున్నది. అయితే ఈ ప్రచారము సత్యమ, అసత్యమా అన్న విషయానికి వస్తే ఈ అమావాస్య నాడు ఏర్పడుతున్నటువంటి సంపూర్ణ సూర్యగ్రహణం పసిఫిక్ మహాసముద్రము న్యూజిలాండ్ అంటార్కిటికా ఆస్ట్రేలియా పలు విదేశాలలో కనబడుతుంది. కావున మనకు లేదని శివశ్రీ జంగం మహేష్ స్వామి శుక్రవారం ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 21 న మన భారతదేశంలో ఎక్కడ కూడా ఈ గ్రహణం కనిపించదు కావున ఏ విధమైనటువంటి నియమాలు పాటించన అవసరము లేదని. టీవీ ప్రచార మాధ్యమాలలో వచ్చినటువంటి వదంతులను దయచేసి నమ్మకండి అని ఆయన తెలియజేశారు.
అదేవిధంగా గ్రహణము లేదు కనుక ఎలాంటి సంశయములు లేకుండా ఈ అమావాస్యకు పితృ కర్మలు యధావిధిగా నిర్వర్తించుకోవచ్చు అన్నారు.
;:
