17/02/2026
Sangareddy News

Sadashivpet News : సాధారణ ఎన్నికలు 2026 లో భాగంగా సదాశివపేట మున్సిపల్ 12వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీమతి. శ్రీ మామిడి మమత రాజు దంపతులు తన వార్డు ప్రజలందరితో కలిసి భారీ ఊరేగింపుతో గురువారం రోజున ఉదయం 10 30 నిమిషాల నుండి పాతకేరిలోని పిఎంఆర్ గణేష్ మండపం నుండి వార్డు సభ్యులు నాయకులు, మిత్రులు శ్రేయోభిలాషులందరితో కలిసి బాణాసంచా కాలుస్తూ తన వార్డు గుండా ఊరేగింపుగా వెళ్లి తమ సతీమణి అయిన పులిమామిడి మమత యొక్క నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి జయశ్రీ మేడంకు అందజేశారు.పులిమామిడి రాజు మాట్లాడుతూ రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయ డంకా మొగిస్తుందని, ప్రజలు అభివృద్ధి చేసేటటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికే మళ్ళీ పట్టం కడతారని ఫులిమామిడి రాజు
మీడియా ముఖంగా తెలియ పరిచారు. ఇట్టి నామినేషన్ ప్రతి పాధకులుగా పద్మ మాణిక్యం మరియు ఆంజనేయులు గౌడ్ వ్యవహరించారు. ఇట్టి నామినేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిడిసి చైర్మన్ గడీల రామ్ రెడ్డి, మండల అధ్యక్షుడు చాట్ల సిద్దన్న, పట్టణ అధ్యక్షుడు మునిపల్లి సత్యనారాయణ, ఆత్మ కమిటి చైర్మన్ ప్రభు, మార్కెట్ కమిటి డైరెక్టర్ చిర్రు, ఈశ్వర్ మార్కండేయ దేవస్థానం ఆలయ కమిటీ చైర్మన్ వెంకన్న బాబు (లడ్డు ), ముదిరాజ్ సంఘం నాయకులు చాపల హనుమంతు, బంటు రవి, కంది మల్లేష్, నందు, నల్ల మల్లేశం, వెంకట్, చిదానందం, వైద్యం పవన్, గంట శివన్న, పి.ఎం.ఆర్ యువసేన నాయకులు రాగం అనిల్, గుణాకర్, చిన్న, తాలెల్మ రాము, చోటు, జబ్బార్, ఫహీం, షకీల్, జాంగీర్, ఖర్చర్ల హరీష్, సంగన్న, కోసిగె కృష్ణ, వినయ్, వేణు, వెంకటేశం, చీలం సురేష్, మనోజ్, అఖిల్, సోమ శంకర్, పరమేష్, సుభాష్, పరమదాసు, చింటూ, మరియు మహిళలు మాధవి, శశికళ, స్వరూప, ఉషాకిరణ్ యూత్ సభ్యులు, మార్కండేయ యూత్ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *