17/02/2026
Sangareddy News

Sadashivpet News : సదాశివపేట మున్సిపల్ ఎన్నికల్లో 14 వార్డు నుండి BRS అభ్యర్థిగా ఛాయాదేవి శాంతకుమార్ గురువారం నామినేషన్ వేశారు.ఈ సందర్భంగా ఛాయాదేవి శాంతకుమార్ మాట్లాడుతూ…గతంలో వార్డు ప్రజలు నన్ను ఆశీర్వదించి కౌన్సిలర్ గా ఎన్నుకున్నారని,ప్రస్తుతం తాను చేసిన అభివృద్ధి,సేవ కార్యక్రమాలు మరోసారి గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.బి ఆర్ ఎస్ పార్టీ తన పై నమ్మక తో టికెట్ ఇచ్చిందని …నమ్మకాన్ని వమ్ము చేయకుండా గెలిచి తీరుతానని ఆశాభావం వ్యక్తం చేశారు.స్థానికBRS నాయకులు మాట్లాడుతూ.. సేవరూపం, మానవత్వానికి ప్రతిరూపంగా ఇప్పటి వరకు ఎన్నో సహాయసహకారాలు అందిస్తూ .. ముందుకు సాగుతు మున్సిపల్ అభివృద్ధికి నేను సైతం ప్రజల్లో ముందుకు సాగుతున్నా ఛాయ శాంతకుమార్ ను ప్రజలు మనసారా ఆశీర్వదించి అభివృద్ధికి పట్టం కట్టుతారని అభిప్రాయం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు ఆత్మకూరు నాగేష్,నాయకులు కంది మల్లేశం,విలాస్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *