17/02/2026
Sangareddy News

Sadashivpet News : సదాశివపేటలోని 20వ వార్డులో జనరల్ ఫండ్ లక్ష ఇరవై వేల రూపాయలతో బోరు పనులను ప్రారంభించిన టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి. ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ సదాశివపేటలో ఏ వార్డులో కూడా నీటి సమస్య లేకుండా చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం లో ఎలాంటి సమస్యలను ఎదుర్కోకుండా చూడటమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో సి డి సి చైర్మన్ గడిల రాంరెడ్డి, పట్టణ అధ్యక్షుడు మునిపల్లి సత్యనారాయణ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిరు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పిల్లోడి విశ్వనాథం, మాజీ కౌన్సిలర్లు అరుణ్ కుమార్, నాగరాజు గౌడ్, రాయిపాడ్ రమేష్, కాంగ్రెస్ నాయకులు శంకర్ గౌడ్, నరసింహులు గౌడ్, ప్రశాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *