Bubaarathi

Sangareddy News : తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక భూ చట్టం” భూభారతి” ని సమర్థవంతంగా, క్షేత్ర స్థాయిలో అమలు చేయాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు రెవెన్యూ అధికారులకు పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్లో రెవెన్యూ అధికారులతో మాట్లాడారు. తేదీ :16-04-2025 రోజు బుధవారం ,రెవెన్యూ అధికారులకు శిక్షణ , రైతులకు తేదీ : 17 నుంచి 30 వరకు మండలాలవారీగా అవగాహన సదస్సులు వుంటాయని అన్నారు . నూతన భూభారతి పోర్టల్ ను ఓపెన్ చేసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు మాట్లాడుతూ … ప్రభుత్వ ప్రతిష్టాత్మక నూతన భూ చట్టం భూభారతిని సమర్థవంతంగా క్షేత్రస్థాయిలో అమలు చేయాలని అధికారులు ఆదేశించారు. భూభారతి రైతుల సమస్యలు పరిష్కరించి, భూముల వివాదాలు లేకుండా జిల్లాను తీర్చిదిద్దా లని అన్నారు. రైతులు కార్యాలయాల చుట్టూ, అధికారుల చుట్టూ తిరగకుండా ఉండేందుకు భూభారతిని పకడ్బందీగా అమలు చేయాలన్నారు. రైతుల భూ సమస్యల శాశ్వత పరిష్కారమే ధ్యేయంగా,గ్రామ, మండల ,జిల్లా స్థాయిలో రైతులు ప్రజలు లేవనెత్తే సందేహాలకు అర్థమయ్యే భాషల్లోని సమాధానాలు చెప్పి , భూ సమస్యలకు పరిష్కారాలు చూపాలని, రెవెన్యూ అధికారులకు కలెక్టర్ సూచించారు. రైతులు ఈ అవగాహన కార్యక్రమాలను విజయవంతం చేయాలనీ అన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *