18/02/2026
సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల దుర్వినియోగం, మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ వివరాలు ప్రకటిస్తున్న దృశ్యం.

Sangareddy News : మన చుట్టూ జరుగుతున్న వివిధ రకాల ఆన్లైన్ మోసాలు, మాదక ద్రవ్యాల మత్తులో జీవితాలను అందకారంలోకి నెడుతున్న యువత, జిల్లాలో మహిళల భద్రత వంటి అంశాలపై జిల్లా వ్యాప్తంగా విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఒక ప్రకటనలో తెలియజేశారు. సైబర్ నేరాలు అనేవి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ఎదురుకుంటున్న సమస్య, సైబర్ నేరాల నుండి బయటపడాలంటే అవగాహన ముఖ్యం అని అన్నారు. అత్యాశకు పోయి సైబర్ నేరాల బారిన పడవద్దని యువతకు సూచించారు. అమాయక ప్రజల బాలహీనతే, సైబర్ నేరగాళ్ల బలంగా.. వివిధ రకాల సైబర్ మోసాలకు పాల్పడుతున్నారన్నారు. ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్సీ అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో టెక్నాలజీ వాడుకొని మరిన్ని సైబర్ మోసాలకు పాల్పడుతున్నారని, ప్రతిఒక్కరు అవగాహన కలిగి, అప్రమత్తంగా ఉన్నప్పుడే సైబర్ నేరాలను అరికట్టవచ్చు అన్నారు. ఎవరైనా సైబర్ నేరాలకు గురి అయినట్లైతే వెంటనే 48 గంటలలోపు 1930 కు కాల్ చేసి గాని, యన్.సి.ఆర్.బి. (https://www.cybercrime.gov.in) పోర్టల్ నందు కాంప్లయింట్ నమోదు చేయాలని సూచించారు.
మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై పటాన్ చెర్వు ఇన్స్పెక్టర్ వినాయక్ రెడ్డి పారిశ్రామిక వాడలలో ఉద్యోగులకు, మాదక ద్రవ్యాల దుర్వినియోగం, ఆన్లైన్ మోసాలు, మహిళల భద్రత, తదితర అంశాల గురించి అవగాహన కలిపించడం జరిగింది. డ్రగ్ మహమ్మారి బారినపడి కుటుంబ జీవితాలను పాడు చేసుకుంటున్నారని, మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి దూరంగా ఉండి భవిష్యత్తుపై దృష్టి సారించాలని అన్నారు. తల్లిదండ్రులు పిల్లల కదలికలు వారి స్నేహితులు, నడవడికను కనిపెట్టాలని అన్నారు. జిల్లాలో గంజాయి అక్రమ రావాణాపై జిల్లా పోలీసు శాఖ ఉక్కు పాదం పోపుతూ.. గంజాయి పండించినా, అక్రమ రవాణా చేసినా, అమ్మిన, సేవించిన చట్ట రిత్య కఠినంగా శిక్షించడం జరుగుతుందన్నారు.
జిల్లాలో మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ.. షి-టీం బృందాలు వివిధ కళాశాలలు, పని ప్రదేశాలలో, రద్దీ ప్రాంతాలలో నిఘా వేస్తూ ఆకతాయిలకు, కౌన్సలింగ్ నిర్వహించడం జరుగుతుంది. మహిళలు ఎలాంటి వేదింపులకు గురైన జిల్లా షి టీం నెంబర్ 8712656772 కు కాల్ చేసి లేదా వాట్స్ అప్ ద్వారా గాని సమాచారం అందించాలని అన్నారు.
ట్రాఫిక్ రూల్స్ ప్రతి ఒక్కరు పాటించాలని, మోటర్ సైకిల్ నడిపేటప్పుడు తప్పని సరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని, వాహనాలు నడుపుతూ సెల్ ఫోన్ మాట్లాడకూడదని, వాహనాలను పరిమిత వేగంలో నడపాలని సూచించారు. ముఖ్యంగా మైనర్ లకు వాహనాలు ఇవ్వరాదని, మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే తల్లిదండ్రులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *