18/02/2026
District SP Paritosh Pankaj IPS addressing the media, announcing that Section 30 and 30(A) of the Police Act will be in force across Sangareddy district from December 1 to 31, stating that public gatherings such as protests, rallies, and meetings require prior police permission.

Sangareddy News : శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని నెల రోజుల పాటు అనగా డిసెంబర్ 1వ తేది నుండి 31 వరకు సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీసు యాక్ట్-1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ. పరితోష్ పంకజ్ ఐపియస్. ఒక ప్రకటనలో తెలియజేశారు. కావున సంగారెడ్డి జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పోలీసుల ముందస్తు అనుమతి లేనిది ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్స్, సభలు, సమావేశాలు నిర్వహించరాదని, శాంతి భద్రతలకు భంగం కలిగే విధంగా, ప్రజాధనానికి నష్టం కల్గించే, ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టకూడదన్నారు. జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు ఇట్టి విషయంలో పోలీసు వారికి సహకరించవలసిందిగా ఎస్పీ సూచించారు.

అనుమతి లేకుండా పై చర్యలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై చట్టరిత్య కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

జిల్లా వ్యాప్తంగా స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున, ఇతర వ్యక్తులను గానికి, రాజకీయ పార్టీలను గాని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినా, సామాజిక మాద్యమాలలో పోస్టులు పేటిన చట్ట రిత్య కఠిన చర్యలు తప్పవని, జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి కఠినంగా అమలు చేయడం జరుగుతుందని ఎస్పీ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *