
Sangareddy News : ప్రతిష్టాత్మక గామా అవార్డ్స్ 5వ ఎడిషన్ దుబాయ్‌లోని షార్జా ఎక్స్‌పో సెంటర్‌లో వైభవంగా జరిగింది. వైభవ్ జ్యువెలర్స్ సమర్పణలో, Keinfra Properties ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో టాలీవుడ్ ప్రముఖులు హాజరై సందడి చేశారు. నేషనల్ స్థాయిలో విశేష గుర్తింపు పొందిన పుష్ప 2 – ది రూల్ గామా బెస్ట్ మూవీ అవార్డు అందుకుంది. అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్‌గా, మీనాక్షి చౌదరి బెస్ట్ హీరోయిన్‌గా ఎంపికయ్యారు.