Sangareddy News : సంగారెడ్డిలోని పోతిరెడ్డిపల్లి హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో జరిగిన వినాయక నిమజ్జనోత్సవంలో లడ్డు వేలం పాటలో పోతిరెడ్డిపల్లికి చెందిన జగ్గారి నారాయణరెడ్డి రూ.3,61,000 భారీ ధరకు లడ్డును దక్కించుకున్నారు. గతంతో పోలిస్తే లడ్డు వేలం ధర పెరుగుతుండటం పట్ల హనుమాన్ యూత్ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ వేలం పాట అత్యంత హోరాహోరీగా సాగింది.
