
Sangareddy News : సంగారెడ్డిలోని రాజంపేట నుంచి హాస్టల్ గడ్డ వరకు రోడ్డును అద్భుతంగా మార్చాలని, సీసీ రోడ్డు, సెంట్రల్ లైటింగ్ పనులు వెంటనే ప్రారంభించాలని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గురువారం డిమాండ్ చేశారు. మున్సిపల్ అధికారులతో కలిసి రోడ్డును పరిశీలించిన ఆయన, జనరల్ నిధుల నుంచి రెండు కోట్ల రూపాయలు కేటాయించి పనులు చేపట్టాలని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని సూచించారు.