18/02/2026
సంగారెడ్డి జిల్లాలో RRR రోడ్డు నిర్మాణంతో భూములు కోల్పోతున్న రైతుల తరపున కలెక్టర్‌కు మెమోరాండం సమర్పిస్తున్న ఎమ్మెల్యే చింతా ప్రభాకర్

Sangareddy News : సంగారెడ్డి జిల్లా, కొండాపూర్ మండలంలో R R R రోడ్డు నిర్మాణంతో భూములు కోల్పోతున్న రైతుల తరపున ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ జిల్లా కలెక్టర్‌కు మెమోరాండం సమర్పించారు. గిర్మాపూర్, అలియాబాద్, మారేపల్లి, మాచపల్లి, గంగారం తాండ, శివన్నగూడెం గ్రామాలకు చెందిన పేద రైతులు ఈ భూములపైనే ఆధారపడి జీవిస్తున్నారని, భూములు కోల్పోతే వారి జీవనోపాధి దెబ్బతింటుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పేద రైతులకు న్యాయం చేయాలని, ప్రభుత్వానికి లేఖ రాయాలని కలెక్టర్‌ను కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *