
Sangareddy News : మంగళ వారం సంగారెడ్డి పట్టణం లోని 3వ వార్డులో మంగలి కిట్టు,స్వప్న ల ఇంటి వద్ద కిట్టు కుటుంబ సభ్యులతో కలసి భోజనం చేశారు. కిట్టు కుటుంబ సభ్యులను కలెక్టర్ సన్న బియ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. సన్న బియ్యం పంపిణీ తో మా కుటుంబం సంతోషంగా ఉందని కిట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. సన్న బియ్యం పథకం మా కుటుంబానికి ఎంతో.మేలు చేస్తుందని తెలిపారు. సన్న బియ్యం అన్నంతో కడుపునిండా అన్నం తింటున్నామని, ఎంతో మంది నిరుపేదలకు ఈ పథకం ఉపయోగ పడుతుందని తెలిపారు. మానవతా దృక్పథంతో నడిపిస్తున్న గొప్ప పథకం అని రాష్ట్ర ప్రభుత్వానికి వారు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు. భోజనం అనంతరం రేషన్ షాపును పరిశీలించి , సన్న బియ్యం పంపిణీ వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లాలో 846 రేషన్ షాపులకు గాను 3లక్షల,78 వేల728 రేషన్ కార్డులు ఉన్న లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ జిల్లాలో సమర్థవంతంగా అమలవుతుందని తెలిపారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా 7999 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేయడం జరిగింది. సన్న బియ్యం సరఫరా చేయడం వల్ల రుచికరమైన భోజనం చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నాణ్యత గల సన్న బియ్యం పంపిణీ పై ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందని కలెక్టర్ తెలిపారు.
గతంలో దొడ్డు బియ్యం రేషన్ షాపుల ద్వారా తీసుకుని దొడ్డు బియ్యం క్వాలిటీ బాగోలేకరీసైకిలింగ్ చేయడం, వేరే వారికి అమ్మడం జరిగేదని తెలిపారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని రాష్ట్ర ప్రభుత్వం వీటన్నిటికీ చెక్ పెడుతూ సన్న బియ్యం కార్యక్రమాన్ని ముందుకు తీసుకు వచ్చిందని తెలిపారు.సన్న బియ్యం పథకం ద్వారా ప్రతి ఒక్కరూ రుచికరమైన భోజనం చేస్తున్నారని అధిక డబ్బులు వెచ్చించి బియ్యాన్ని బయట కొనుగోలు చేయకుండా ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని లబ్ధిదారుస్వయంగా కలెక్టరు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సన్న బియ్యం పథకాన్ని సద్వినియోగం చేసుకొని లబ్ది పొందాలని అన్నారు. ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ మాధురి, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి, సివిల్ సప్లై మేనేజర్ అంబదాస్ రాజేశ్వర్ , సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.